కార్పొరేట్‌ కంపెనీలకు పాలకులు దాసోహం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ కంపెనీలకు పాలకులు దాసోహం

Dec 17 2025 6:37 AM | Updated on Dec 17 2025 6:37 AM

కార్పొరేట్‌ కంపెనీలకు పాలకులు దాసోహం

కార్పొరేట్‌ కంపెనీలకు పాలకులు దాసోహం

దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా

ఐక్యంగా పోరాడాలి

రైతు కూలీ సంఘం నిరసన ర్యాలీ

అనకాపల్లి : కార్పొరేట్‌ కంపెనీలకు పాలకులు దాసోహమయ్యారని రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆరోపించారు. విజయరామరాజుపేట రైల్వే అండర్‌ బ్రిడ్జి నుంచి న్యూకాలనీ వరకూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యూకాలనీ రోటరీ హాల్లో సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్‌రావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికులను, పీడిత ప్రజలను దోపిడీ చేసే విధానాలను వేగవంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. దానిలో భాగంగానే పచ్చని పంట పొలాలను కారు చౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయన్నారు. జిల్లాలో దశాబ్దల కాలం పాటు రైతులకు, కార్మికులకు ఉపాధిని చూపించిన వ్యవసాయాధారిత సుగర్‌ ఫ్యాక్టరీలను మూసేశారని, గూగుల్‌ డేటా సెంటర్‌, బల్క్‌ డ్రగ్‌ పార్కులు, ఫార్మా సిటీలు, హైడ్రో పవర్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల పేరుతో ప్రజల భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడినప్పుడే పాలకుల దోపిడీ విధానాలను అరికట్టవచ్చని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement