● స్నోయగం
మంచు వెన్నముద్ద
సూర్యోదయం వేళ.. మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌రోడ్డు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దంపట్టింది. అడుగడుగునా దట్టమైన వృక్షాలు, భూమిని తాకేటట్టుగా వేలాడుతున్న పచ్చని తీగలు. వనమూలికల సువాసనతో స్వచ్ఛమైన గాలి ఔషధంగా మారిపోయింది. వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. చెట్లపై నుంచి జారే మంచు బిందువుల ’చిటపట’ శబ్దాలు మంచి అనుభూతిని కలిగించాయి. వ్యూపాయింట్ వద్ద మంచు అందాలుసందర్శకులను అబ్బురపరిచాయి. భానుడి స్వర్ణమయ కిరణాలు ఆకులపై పడి మరింత ప్రకాశవంతంగా మారాయి. మన్యం ప్రాంతమంతా స్వచ్ఛమైన ఆకుపచ్చ, గోధుమ, పసిడి రంగుల మేళవింపుతో సరికొత్త అందాన్ని సంతరించుకుంది. – రంపచోడవరం
● స్నోయగం
● స్నోయగం
● స్నోయగం


