వన్డే మ్యాచ్‌కు పటిష్ట భద్రత
అల్లిపురం: భారత్, దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మొత్తం 1,500 మంది పోలీస్ సిబ్బందితో, 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్టేడియం వద్ద గల ఒక కల్యాణ మండపంలో శుక్రవారం పోలీస్ అధికారులతో ఆయన సమావేశమై.. తగిన సూచనలిచ్చారు.
నిబంధనలు ఇవీ.. : నిర్దేశిత సమయానికి రెండు గంటల ముందుగానే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారు. ● బయట నుంచి వాటర్ బాటిల్స్, తిను బండారాలు అనుమతించరు. ● మోసగాళ్ల వద్ద నకిలీ(కలర్ జిరాక్స్) టికెట్లు కొని అభిమానులు మోసపోవద్దు. ● మైదానంలోకి దూసుకెళ్లడం, ఆటగాళ్లతో సెల్ఫీలకు ప్రయత్నించడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ● స్టేడియం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో దొంగతనాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రైమ్ సిబ్బంది నిఘా ఉంటుంది.
ట్రాఫిక్ నిబంధనలు: శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వైపు హైవేపై శొంఠ్యాం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్లాలి. విశాఖ నుంచి ఆనందపురం వైపు వెళ్లే వారు లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, శొంఠ్యాం మీదు గా ప్రయాణించాలి. బస్సులు/కమర్షియల్ వాహనాలు మారికవలస, జురాంగ్ జంక్షన్, బీచ్‌రోడ్, రుషికొండ మీదుగా నగరంలోకి చేరుకోవాలి. నగరం నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు హనుమంతవాక వద్ద ఎడమవైపు తిరిగి.. అడవివరం, శొంఠ్యాం, నీళ్లకుండీలు మీదుగా ప్రయాణించాలి. మ్యాచ్‌కు వచ్చే వారు నిర్దేశించిన ప్రాంతాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. స్టేడియం చుట్టుపక్కల నివాసం ఉన్న వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి.


