బురుజుపేటలో జనజాతర
(9వ పేజీ తరువాయి)
నుంచి ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో జగన్నాథస్వామి ఆలయం వరకు క్యూలు విస్తరించాయి. రూ.100, రూ.200, రూ.500 టికెట్లు, ధర్మదర్శనం క్యూలతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఎన్‌క్లేవ్ ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలు, మంచినీటి సదుపాయం, ప్రసాదం కౌంటర్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, ప్రసాదాలను పంపిణీ చేశాయి. జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో సుమారు 5 వేల మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని జగదాంబ జంక్షన్, పాత పోస్టాఫీస్, కాన్వెంట్ జంక్షన్ మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో కె.శోభారాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఎమ్మెల్యే వెంటే వందలాది మంది
అమ్మవారి దర్శనానికి సామాన్య భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండగా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యేతో పాటు వందలాది మంది అనుచరులు, కార్యకర్తలు లోపలికి చొచ్చుకువెళ్లడం గందరగోళానికి దారితీసింది. తామే అంతా అన్నట్లుగా ఎమ్మెల్యే, అతని వెనక ఉన్న వారు వ్యవహరించడం, సిఫార్సు లేఖల పేరి ట హడావిడి చేయడంతో ఆలయ సిబ్బంది, పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరుల తీరుపై ఆలయ ఉద్యోగులు, వారిని నియంత్రించలేక పోలీసులు అసహనానికి గురయ్యారు. ఇదే అదనుగా భావించిన కొందరు పోలీసులు, సిబ్బంది మాత్రం.. ఎమ్మెల్యే వెళ్తున్న సమయంలోనే తమ కుటుంబ సభ్యులను లోపలికి పంపించడం గమనార్హం.
బురుజుపేటలో జనజాతర


