● ఆర్గానిక్ మేళాకు స్పందన
ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన 6వ విశాఖ ఆర్గానిక్ మేళా 2025కు విశేష స్పందన లభించింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఆర్గానిక్ వస్తువుల వాడకాన్ని రానున్న రోజుల్లో విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉత్పత్తిదారులను, రైతులను కోరారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ మేళా మరో మూడు రోజులు కొనసాగనుంది.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్
గానుగ నూనె తీయడాన్ని తిలకిస్తున్న విద్యార్థులు
అటవీ ఉత్పత్తులను విక్రయిస్తున్న గిరిజన మహిళ
● ఆర్గానిక్ మేళాకు స్పందన
● ఆర్గానిక్ మేళాకు స్పందన


