● 8వ వసంతంలోకి జూ.దళపతి
గ్రాండ్‌గా
సెలబ్రేట్ చేసిన
జూ
అధికారులు
ఇందిరాగాంధీ జూ పార్కులో గురువారంపండగ వాతావరణం నెలకొంది. ‘జూనియర్ దళపతి’గా పిలుచుకునే నీటి ఏనుగు(హిప్పోపాటామస్) 8వ పుట్టిన రోజు వేడుకలను జూ అధికారులు ఘనంగా నిర్వహించారు. నీటి ఏనుగు ఎన్ క్లోజర్ వద్ద వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరణ చేశారు. సీపీఈ కళాశాల విద్యార్థులు, సందర్శకులతో కలిసి జూ అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. యానిమల్ కీపర్ చేత కేకు కట్ చేయించారు. ఆ సమయంలో విద్యార్థులు, సందర్శకులు నీటి ఏనుగు మాస్కులను ధరించి, పాటలు పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి.మంగమ్మ.. నీటి ఏనుగు జీవిత విశేషాలు, అవి తినే ఆహారం, వాటి అలవాట్లు మొదలైన వాటి గురించి విద్యార్థులకు వివరించారు. – ఆరిలోవ
● 8వ వసంతంలోకి జూ.దళపతి
● 8వ వసంతంలోకి జూ.దళపతి


