50 శాతం రాయితీతో మహిళల దుస్తుల విక్రయాలు
డాబాగార్డెన్స్: వివాహ వేడుకలు దృష్టిలో పెట్టుకుని నేషనల్ సిల్క్ ఎక్స్‌పో ప్రత్యేకంగా మహిళల కోసం 50 శాతం రాయితీతో విస్తృత శ్రేణి వస్త్రాలు, ఉపకరణాలు అందజేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గ్రీన్‌పార్క్ హోటల్ వేదికగా ఈ నెల 11 వరకు ఎక్స్‌పో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎక్స్‌పోలో మహారాష్ట్ర పైథాన్ సిల్క్ చీరలు, కర్ణాటక బెంగుళూరు సిల్క్, సాఫ్ట్ సిల్క్, కాషిదా సిల్క్ చీరలు, మధ్యప్రదేశ్ నుంచి ప్రసిద్ధి చెందిన చందేరి, మహేశ్వరి సిల్క్ చీరలు, పశ్చిమ బెంగాల్ నుంచి బలూచారి, జమదాని, టాంగైల్, ఢకాయ్ సిల్క్ వస్త్రాలు, లినెన్ కాంతా వర్క్ స్టిచ్ చీరలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేరెన్నికగన్న వస్త్రాలు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. అంతేగాక దుప్పట్లు, వివిధ డిజైన్స్ సల్వార్ మెటీరియల్స్, నమూనాలు, బీహార్ టస్సార్, మట్కా, భాగల్పూర్ సిల్క్, గుజరాత్ సాంప్రదాయ బంధిని, కచ్ ఎంబ్రాయిడరీ, పటోలా, తమిళనాడు కంజీవరం పట్టు చీరలతో పాటు జమ్ము తావి నుంచి వచ్చిన ఎంబ్రాయిడరీ సిల్క్, తావీ సిల్క్ చీరలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని, ప్రవేశం ఉచితమని చెప్పారు.


