సీఎస్సార్‌ నిధులతో కొత్త డయాలసిస్‌ యూనిట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎస్సార్‌ నిధులతో కొత్త డయాలసిస్‌ యూనిట్లు

Nov 6 2025 8:34 AM | Updated on Nov 6 2025 8:34 AM

సీఎస్సార్‌ నిధులతో కొత్త డయాలసిస్‌ యూనిట్లు

సీఎస్సార్‌ నిధులతో కొత్త డయాలసిస్‌ యూనిట్లు

కేజీహెచ్‌లో ప్రారంభించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి

మహారాణిపేట: ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే వైద్య సేవలను డిజిటల్‌ విధానంలో ప్రజలకు చేరువ చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సీఎస్సార్‌ కింద ఎన్టీపీసీ సమకూర్చిన రూ.2 కోట్ల ఆర్థిక సహాయంతో కేజీహెచ్‌ నెఫ్రాలజీ విభాగంలో ఆధునికీకరించిన హీమో డయాలసిస్‌ యూనిట్‌ను బుధవారం ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో కుప్పంలో సంజీవని పేరుతో పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, దశల వారీగా రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్‌ వైద్య సేవలను చేరువ చేస్తామని చెప్పారు. కేజీహెచ్‌ నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 13 సబ్‌ యూనిట్లతో సేవలు అందుతున్నాయని, అదనంగా ఎన్టీపీసీ సాయంతో మరో 10 కొత్త డయాలసిస్‌ సబ్‌ యూనిట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్‌ రాజు, వంశీకృష్ణ, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌, ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్‌ డాక్టర్‌ రవిరాజు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీఎస్‌ సంధ్యాదేవి, కేజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌ బీవీ రమణ, నెఫ్రాలజీ విభాగం ఇన్‌చార్జి హెచ్‌వోడీ డాక్టర్‌ రత్నప్రభ, కార్పొరేటర్‌ కొడూరు అప్పలరత్నం, ఎన్టీపీసీ ప్రతినిధులు పాత్రో, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement