అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
కొమ్మాది: ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులకు సూచించారు. రుషికొండలోని బి.ఆర్.అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవన్‌ను బుధవారం ఆయన సందర్శించి, గ్రంథాలయం, కంప్యూటర్ గదులు, సెమినార్ హాళ్లను తనిఖీ చేశారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి.. ఏకాగ్రత పెంపొందించుకొని, ప్రతీ క్షణాన్ని వినియోగించుకోవాలన్నారు.
వినతిపత్రం అందజేత
ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఆర్భాటంగా జీవో విడుదల చేసి ఏడు నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికీ రుణం మంజూరు కాలేదని, వెంటనే రుణాలు విడుదల చేయాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డా.బూసి వెంకటరావు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి వినతి పత్రం అందజేశారు. పెను ముప్పుతో జరిగే అసహజ మరణాలకు ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారంలో వివక్ష ఉందని అందులో పేర్కొన్నారు.


