కమ్యూనికేషన్ రిపీటర్ పరిశీలన
తగరపువలస: ఆనందపురం కొండపై ఉన్న పోలీస్ కమ్యూనికేషన్ రిపీటర్‌ను మంగళవారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. ఒకటిన్నర కిలోమీటరు దూరం కాలినడకన కొండపైకి వెళ్లి.. అక్కడ ఉన్న కమ్యూనికేషన్ రిపీటర్‌ను సీపీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొబైల్ నెట్‌వర్క్ పనిచేయని అత్యవసర పరిస్థితుల్లో రిపీటర్ సేవలకు పవర్ బ్యాకప్ అందుబాటులో ఉందా లేదా అని ఆరా తీశారు. తుపాను కారణంగా కమ్యూనికేషన్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సీపీ ఆనందపురం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిసరాలు, నిర్వహణలో చేయాల్సిన మార్పులను సిబ్బందికి సూచించారు.


