● భానుడు వర్సెస్ వరుణుడు!
సాక్షి, విశాఖపట్నం : మహా విశాఖ నగరంలో భిన్నమైన యుద్ధం జరిగింది. భానుడు, వరుణుడు.. నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డారు. ఒకసారి.. వరుణుడిది పైచేయి అయితే.. మరోసారి భానుడు భగభగలతో విజయం సాధించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దోబూచులాటలే జరిగింది. సూర్యోదయం అయిన కాసేపటికే నగరం మేఘావృతమైంది. ఒక్కసారిగా వర్షం కురిసింది. ఇక రోజంతా వర్షం పడుతుందేమో అని నగరవాసులు అనుకునే సరికి.. సూర్యుడు విజృంభించాడు. ఇక వర్షం పడదు అనుకునే సరికి మళ్లీ వర్షం కురిసింది. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండ వానతో భిన్న వాతావరణం కనిపించింది. గత రెండు రోజులుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తీవ్ర వాయుగుండంగానైనా, తుఫాన్‌గా అయినా బలపడే సూచనలున్నాయి. దీని ప్రభావంతో ఈనెల 27 నుంచి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి.
ప్రాంతం వర్షం(మి.మీలలో)
మహారాణిపేట 33
పెదగంట్యాడ 32.8
ములగాడ 28.25
సీతమ్మధార 27.0
పద్మనాభం 26.75
గాజువాక 26.25
శ్రీనగర్ 24.5
పరదేశిపాలెం 23.75
గురుద్వార 23.0
మదీనాబాగ్ 23.0
ఆరిలోవ 19.0
మధురవాడ 15.75
● భానుడు వర్సెస్ వరుణుడు!
● భానుడు వర్సెస్ వరుణుడు!


