మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గ చర్య
సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక తప్పిదమని, దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘ప్రజా ఉద్యమం’ చేపడుతుంది. గురువారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో కేకే రాజు ఆధ్వర్యంలో ‘ప్రజా ఉద్యమం‘ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రను తిరగరాసి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే కేజీహెచ్ దిక్కుగా ఉండేదని.. వారి కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాడేరులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని కొనియాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకూ వైఎస్సార్ సీపీ ఆందోళన కొనసాగిస్తుందన్నారు. అందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎస్‌ఈసీ సభ్యులు జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాసరావు, రొంగలి జగన్నాథం, డాక్టర్ జహీర్ అహ్మద్, పి.సతీష్ వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయ చంద్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, ఎస్.రవీంద్ర భరత్, బర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, రాయపురెడ్డి అనిల్‌కుమార్, శ్రీదేవి వర్మ, మారుతీ ప్రసాద్, ఎస్.ప్రసాద్ రావు, దేవరకొండ మార్కెండేయులు, కేవీ బాబా, బోండా ఉమామహేశ్వరరావు, నీలి రవి, స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి, కార్పొరేటర్లు పీవీ సురేష్, కె.అనిల్ కుమార్ రాజు, అక్కరమాని పద్మ, బిపిన్ కుమార్ జైన్, చెన్నా జానకిరామ్, మహ్మద్ ఇమ్రాన్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ షరీఫ్, ముఖ్యనేతలు ద్రోణంరాజు శ్రీ వాస్తవ్, ఆల్ఫా కృష్ణ, మంచా నాగమల్లేశ్వరి, అల్లంపల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.


