
వియత్నాం టూరిజంతో ఏపీ ఒప్పందం
విశాఖ సిటీ : ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ వియత్నాంలోని డానాంగ్ టూరిజం అసోసియేషన్‌తో ఎంవోయూ చేసుకుంది. వియత్నాంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ టూరిజం ఫోరం అసోసియేషన్ అధ్యక్షుడు కె.విజయ్‌మోహన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆసియా దేశాల్లో 280 మిలియన్ల బౌద్ధులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న బౌద్ధ క్షేత్రాల సందర్శనకు వారిని రప్పించేందుకు ఇది ఒక ముందడుగు అని చెప్పారు.