
సన్యాసిపాత్రుడికి కేకే రాజు పరామర్శ
ఎంవీపీ కాలనీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ ఉత్తర, తూర్పు నియోజకవర్గాల పరిశీలకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు అనారోగ్య కారణంతో మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.దీంతో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేకే రాజు వెంట ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్స్ అంబటి శైలేష్, ముత్తి సునీల్ కుమార్, జిల్లా ట్రేడ్ యానియన్ ఉపాధ్యక్షులు గాలి ప్రసాద్ తదితరులు ఉన్నారు.