
పోలీస్ కమిషనరేట్‌కు స్కోచ్ అవార్డు
అల్లిపురం: రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించే ప్రత్యేక కేంద్రానికి ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా విశాఖ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన ఈ సహాయ కేంద్రం ద్వారా, 69 రోడ్డు ప్రమాద కేసులలో బాధితులకు రూ. 63.50 లక్షల పరిహారం అందించారు. ఈ సేవా కార్యక్రమానికి గుర్తింపుగా ఢిల్లీలో జరిగిన 102వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో విశాఖ పోలీసులు ఈ అవార్డును స్వీకరించారు. ఈ విజయంతో హిట్ అండ్ రన్ కేసుల బాధితులు, వారి కుటుంబ సభ్యులు, నగర పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి సేవా కేంద్రం ఏర్పాటు చేసినందుకు గాను కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి కృతజ్ఞతలు తెలియజేశారు.