
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
మహారాణిపేట: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు పిలుపునిచ్చారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీల్లో పలువురికి అవకాశం కల్పించారు. రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రత్యేక అధికార ప్రతినిధిగా అల్లంపల్లి రాజబాబు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శిగా జి. విక్టర్ జోసెఫ్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు వారిని జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు అభినందించారు. ఈమేరకు వీరంతా మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, రాష్ట్ర వలంటరీ విభాగం ప్రధాన కార్యదర్శి పోలగం శ్రీనివాసరెడ్డి, వార్డు అధ్యక్షుడు చొల్లంగి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం, ఎస్సీ విభాగం నాయకులు అల్లంపల్లి రాజబాబు, విక్టర్ జోసెఫ్‌లు కేకే రాజును సత్కరించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు