
● క్యూట్ వాక్
ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఫ్యాషన్, ఇంటీరియర్, ఫొటోగ్రఫీ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అద్భుతంగా రూపొందించిన డిజైన్‌లు, సృజనాత్మకమైన ఫొటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ విద్యార్థులు డిజైన్ చేసిన వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై చేసిన వాక్ అందరినీ కట్టిపడేసింది. ఈ ప్రదర్శన ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ రంగంలో రాణించాలనుకునే యువతకు ఒక చక్కటి వేదికగా నిలిచిందని నిర్వహకులు తెలిపారు. ఈ ప్రదర్శనను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని, దీని ద్వారా విద్యార్థుల ప్రతిభకు విస్తృత ప్రచారం కల్పించి, గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హేమసుందర్ టెంకా తెలిపారు. – సీతంపేట

● క్యూట్ వాక్