
వైఎస్సార్‌సీపీ జెండా తొలగింపుపై ఆందోళన
ఆరిలోవ ప్రాంతంలో ఆదివారం జీవీఎంసీ సిబ్బంది వైఎస్సార్‌సీపీ జెండా తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. జీవీఎంసీ సిబ్బంది అత్యుత్సాహంవైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. స్థానిక టీడీపీ నాయకుల కనుసైగలతో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ మహేష్ రోడ్డు పక్కన బడ్డీల తొలగింపు ఆదేశాలను పక్కన పెట్టి, వారి మెప్పు కోసం 13వ వార్డు పరిధి ఆరిలోవ ఆఖరి బస్టాప్ వద్ద ఎవ్వరికీ ఎలాంటి ఆటంకం లేని, ఐదేళ్ల నుంచి ఉన్న పార్టీ జెండాను జేసీబీతో పూర్తిగా జెండా దిమ్మతో సహా తొలగించారు.