
మిల్లెట్ ఆర్ట్‌తో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు
ఏయూ క్యాంపస్: ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరానికి చెందిన మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్‌కుమార్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సహజసిద్ధమైన చిరుధాన్యాలతో ఎనిమిది అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు దాదాపు నెల రోజుల సమయం పట్టిందని మోకా వెల్లడించారు. మోదీ నిలువెత్తు చిత్రపటం బ్యాక్‌గ్రౌండ్‌లో ఆపరేషన్ సిందూర్, మేక్ ఇన్ ఇండియా, వందే భారత్ రైలు, వ్యసాయం, నూతన పార్లమెంట్ భవనం, యోగా తదితర ప్రతిష్టాత్మక కార్యక్రమాల చిత్రాలను తీర్చిదిద్దారు. దేశ ప్రధానిగా సేవలందిస్తూ, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తున్న మోదీని అభినందిస్తూ ఈ చిత్రపటాన్ని తీర్చిదిద్దినట్లు చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్ పేర్కొన్నారు.