వ్యాక్సిన్లు వేస్తామని సీఎం
కార్యక్రమానికి తల్లుల తరలింపు
చంటి పిల్లలతో తల్లులను ఎండలో నడిపించిన అధికారులు
విశాఖ సిటీ: స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో తల్లులకు చుక్కలు చూపించారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలతో పాటు పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఈ స్టాళ్లను సందర్శనకు వస్తుండడంతో ఇక్కడకు రోగులతో పాటు వ్యాక్సిన్ల కోసం పిల్లలను తీసుకువచ్చే బాధ్యతలను ఆర్‌పీలకు అప్పగించారు. దీంతో ఆర్‌పీలు తమ వార్డుల్లో ఉన్న వారిని ఆటోల్లో సీఎం కార్యక్రమానికి తరలించారు. ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం 11.30 గంటలకు కార్యక్రమం జరిగితే ఉదయం 8 గంటలకే వారిని తరలించారు. బీచ్ రోడ్డులో ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో స్టాళ్లను ఏర్పాటు చేయగా.. వీరిని కిలోమీటరు దూరంలో ఏయూ అవుట్ గేట్ వద్దే దించేశారు. దీంతో తల్లులు చంటి పిల్లలను ఎత్తుకొని ఎండలో అవస్థలు పడుతూ నడవాల్సి వచ్చింది. వ్యాక్సిన్ కోసం పిలిచి ఇబ్బందులకు గురి చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు దూరం నడవలేక మధ్యలోనే చెట్లు, ఇళ్ల ముందు కూర్చుండిపోయారు.
ఎండలో కిలోమీటరు నడిపించి..
ఎండలో కిలోమీటరు నడిపించి..
ఎండలో కిలోమీటరు నడిపించి..