
పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా?
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి పత్రికల స్వేచ్ఛను పోలీసు కేసులతో ప్రభుత్వం హరిస్తామంటే ఎలా..? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్‌మీట్ వార్తగా రాస్తే.. సంబంధిత జర్నలిస్టుతో పాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. మీడియా గొంతును నొక్కే ప్రయత్నాలకు పాల్పడుతోంది. అక్షరాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను నోటీసు లు, అక్రమ కేసులతో పోలీసులు నిరోధించలేరు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపులకు పాల్పడుతోంది. – పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే

పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా?