
స్టీల్‌ప్లాంట్ పర్సనల్ డైరెక్టర్‌గా రాకేష్ నందన్ సహ
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ నూతన డైరెక్టర్ (పర్సనల్)గా ఎన్‌టీపీసీ హెచ్‌ఆర్ అదనపు జనరల్ మేనేజర్ రాకేష్ నందన్ సహాయ్ ఎంపికయ్యారు. స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత డైరెక్టర్ (పర్సనల్)ఎస్.సి.పాండే ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండటంతో ఈ ఎంపిక చేశారు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఇంటర్వ్యూకు విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి నలుగురు, బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఇద్దరు, ఎన్టీపీసీ నుంచి ఇద్దరు, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఓఎన్‌జీసీ నుంచి ఒక్కొక్కరు హాజరయ్యారు. వారిలో ఎన్టీపీసీకి చెందిన రాకేష్ నందన్ సహాయ్‌ను ఎంపిక చేసినట్టు పీఈఎస్‌బి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.