
అంబరం.. ఉట్ల సంబరం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మంగళవారం శ్రీకృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. సింహగిరిపై జరుగుతున్న శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా సాయంత్రం ఉట్ల సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని కనులారా తిలకించారు. ఆనంద డోలికల్లో మునిగితేలారు. సాయంత్రం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి శ్రీకృష్ణాలంకారం చేసి శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిలో వేంజేపచేశారు. తొలుత ఆలయ బేడా తిరువీధి నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులను రాజగోపురంలో వేంజేపచేశారు. ఆలయ ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు తాడు లాగగా స్థానిక యాదవుడు నమ్మి అప్పలరాజు ఉట్టిని అందుకున్నాడు. అనంతరం స్వామికి విశేషంగా హారతులిచ్చారు. భక్తులకు తీర్థాన్ని, వెన్నప్రసాదాన్ని అందజేశారు. తదుపరి సింహగిరి మాడ వీధుల్లో స్వామికి తిరువీధిని నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, అర్చకులు ఈ ఉత్సవాన్ని జరిపించారు.

అంబరం.. ఉట్ల సంబరం