
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 111 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 111 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి అత్యధికంగా 51 ఫిర్యాదులు అందాయి. ఇంజినీరింగ్ విభాగానికి 28, ప్రజారోగ్య విభాగానికి 13, రెవెన్యూ విభాగానికి 11, మొక్కల విభాగానికి 3, యూసీడీ విభాగానికి 3, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ విభాగానికి 2 ఫిర్యాదులు వచ్చాయి. అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని మేయర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ఫైనాన్స్ అడ్వైజర్ మల్లికాంబ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.