
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
మహారాణిపేట: వైఎస్సార్ సీపీలో విశాఖ జిల్లాలో వివిధ విభాగాల్లో నూతనంగా నియమితులైన పలువురు పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజును కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్, జిల్లా పార్టీ ఆఫీస్ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి తాడి జగన్నాథ్ రెడ్డి, కిరణ్ రాజు, కార్పొరేటర్ అనిల్ కుమార్‌రాజు, కో ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, అనుబంధ విభాగ అధ్యక్షులు అంబటి శైలేష్, సనపల రవీంద్ర భరత్, బొండా ఉమామహేష్, నాయకులు పులగమ శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు, సూర్య, బంద్ శ్రీను, దుప్పల శ్రీనివాస్, మహ్దాస్ గోపి, గౌస్, కురప్ప, రాఘవలు తదితరులు పాల్గొన్నారు