
వ్యవసాయ డిప్లమో కోర్సులకు 15న స్పాట్ కౌన్సెలింగ్
చింతపల్లి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు అసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 15న స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోగల పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు చివరి అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ చేసుకున్న వారితో పాటు ఇప్పటి వరకూ రిజస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు కూడా ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఆయన వివరించారు. తమ సేంద్రియ పాలిటెక్నిక్‌లో చేరేందుకు అల్లూరి, పరిసర జిల్లాల్లో ఆసక్తిగల విద్యార్థులు అన్ని ధ్రువపత్రాలతో ఈనెల 15వ తేదీన జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు. గుంటూరు లాం ఫాం వ్యవసాయ పరిశోధన స్థానం కృష్ణా ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు స్పాట్ కౌన్సెలింగ్ జరుగుతుందని ఏడీఆర్ తెలిపారు.
చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి