
వైఎస్సార్ సీపీలో నియామకాలు
సీతంపేట : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాకు చెందిన పలువురు నాయకులను అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర నియోజకవర్గానికి చెందిన పలివెల ఈశ్వరిని రాష్ట్ర వీవర్స్ వింగ్ అధికారి ప్రతినిధిగా, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన గంటా రాణిని రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా, ఎడ్ల సత్యంను రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా, గాజువాకకు చెందిన తుమ్మలూరు జగదీష్ రెడ్డిని రాష్ట్ర ఐటీ వింగ్ జోనల్ అధ్యక్షుడిగా, గంగుల రోజా రాణిని రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, తూర్పు నియోజకవర్గానికి చెందిన వానపల్లి ఈశ్వరరావును రాష్ట్ర వీవర్స్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా, బెవర జగదీశ్వరరావును రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సెక్రటరీగా నియమించారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త
కార్యదర్శిగా కిరణ్ రాజు
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జి.ఎస్.వి.వి.ఎ.ఎం.రాజు(కిరణ్‌రాజు) నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.