
బీవోబీ రూ.15 లక్షల బీమా క్లెయిమ్ చెల్లింపు
బీచ్‌రోడ్ : బ్యాంకు ఆఫ్ బరోడా–ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీఎస్పీఎఫ్) మధ్య శాలరీ ప్యాకేజీ ఒప్పందంలో భాగంగా ఇటీవల సహజ మరణం పొందిన ఉద్యోగికి రూ.15 లక్షల బీమా రక్షణ కల్పించామని బ్యాంకు ఆఫ్ బరోడా విశాఖ రీజనల్ హెడ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ లీనా గోహైనా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక ఘటనలో ఏపీఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కొణతాల పరమేశ్వరరావు మృతి చెందారు. ఆయనకు ద్వారకానగర్ బ్రాంచ్‌లో ఖాతా ఉంది. ఒప్పందం మేరకు బ్యాంక్ నుంచి బీమా క్లెయిమ్ ప్రాసెస్ చేసి రూ.15 లక్షల చెక్కును మంగళవారం ద్వారకానగర్ బ్రాంచ్‌లో బాధితుడి భార్య కొణతాల అన్నపూర్ణకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.మహేష్ సమక్షంలో అందజేశామని ఆమె తెలిపారు.