
కాపర్ ప్లేట్లు దొంగిలించిన ముగ్గురి అరెస్టు
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్‌ఫర్నేస్ విభాగంలో జరిగిన కాపర్ ప్లేట్ల దొంగతనం కేసును క్రైం పోలీసులు చేధించారు. పోయిన ఆరు ప్లేట్లులో రెండు ప్లేట్లుగా, మిగిలిన వాటిని దిమ్మలుగా స్వాధీనం చేసుకున్నారు. బీఎఫ్–3 విభాగం పునరుద్ధరణలో తీసి స్టోర్స్‌లో భద్రపరిచిన 45 ప్లేట్లలో ఆరు కాపర్ ప్లేట్లు కనిపించలేదు. సుమారు 1,200 కేజీల బరువు ఉండే విలువైన స్టేవ్స్ దొంగతనంపై విభాగం అధికారులు గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో అందిన సమాచారం మేరకు పోలీసులు వారం రోజుల క్రితం రెండు స్టేవ్స్‌ను సీఆర్‌ఎంపీ ఆర్‌ఈడీ స్టోర్స్ సమీపంలోని పొదల్లో గుర్తించారు. మిగిలిన నాలుగు కాపర్ ప్లేట్లు అప్పటికే గేటు దాటి బయటకు వెళ్లి చేతులు మారిపోయాయి. ఈ నాలుగు ప్లేట్లను 41 దిమ్మలుగా మార్చి వేశారు. నిందితులు రాజా (30), రామస్వామి (30)లతో పాటు స్క్రాప్ వ్యాపారి ప్రకాశ్‌లను అరెస్టు చేశారు. రాజా స్టీల్‌ప్లాంట్‌లో హైడ్రాలిక్ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. రామస్వామి, రాజాలు పక్కా ప్లాన్‌తో లోనికి ప్రవేశించి క్రేన్‌తో ప్లేట్లను బయటపెట్టారు. అందులో నాలుగు ప్లేట్లను స్లాగ్ లారీలో స్లాగ్ కింద పెట్టి బయటకు తరలించారు. మిగిలిన రెండింటిని సమీప పొదల్లో దాచారు. ఈలోగా పోలీసులు ఈ రెండింటిని స్వాధీనం చేసుకోవడంతో మిగిలిన నాలిగింటిని దిమ్మలుగా మార్చారని క్రైం సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. అంత బరువైన ప్లేట్లను తరలించాలంటే అవసరమైన భారీ యంత్రాలు సమకూర్చడంలో ఎవరి పాత్ర ఉందా? అనే అంశంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.