
ఏజీపీగా న్యాయవాది సునీత
విశాఖ లీగల్: నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది పిల్ల సునీత నగరంలోని ప్రధాన సివిల్ జ్యుడీషియల్ కోర్ట్ అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవహారాలు సామాజిక న్యాయం కార్యదర్శి గొట్టపు ప్రతిభా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. సునీత ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. జూనియర్ జ్యుడీషియల్ సివిల్ జడ్జి కోర్టులో ఆమె ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహిస్తారు. సునీతకు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, ఇతర న్యాయవాదులు అభినందనలు తెలిపారు.