
బాలల సంరక్షణ, పునరావాసం చాలా ముఖ్యం
విశాఖలీగల్: బాలల న్యాయ, రక్షణ చట్టాల అమలుపై అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు చిన్నంశెట్టి రాజు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. చట్టంతో విభేదిస్తున్న పిల్లలు–సంరక్షణ, రక్షణ అవసరమైన వారి సంరక్షణ, పునరావాసాన్ని మెరుగుపరచడం తదితర అంశాల గురించి వివరించారు. బాలల సంరక్షణ, పునరావాసం కోసం ఉన్న చట్టాలను, జువైనల్ జస్టిస్ యాక్ట్, పోక్సో చట్టం వంటి వాటిని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలన్న దానిపై చర్చించారు. కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి మంగాకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, జువైనెల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి వరలక్ష్మి, పలు శాఖల అధికారులు, న్యాయవాదులు, న్యాయ అధికారులు పాల్గొన్నారు.