మేహాద్రి నుంచి 530 క్యూసెక్కుల నీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

మేహాద్రి నుంచి 530 క్యూసెక్కుల నీరు విడుదల

Sep 10 2025 9:21 AM | Updated on Sep 10 2025 10:14 AM

మేహాద్రి నుంచి 530 క్యూసెక్కుల నీరు విడుదల

మేహాద్రి నుంచి 530 క్యూసెక్కుల నీరు విడుదల

పెందుర్తి: మేహాద్రి గెడ్డ జలాశయానికి నీటి ఉధృతి పెరగడంతో ఔట్‌ఫ్లోను అధికారులు పెంచారు. ఇప్పటి వరకు రెండవ గేటును మూడు అంగుళాల మేర ఎత్తి 178 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు మంగళవారం సాయంత్రం గేటును మరో ఆరు అంగుళాలు(మొత్తం 9 అంగుళాలు) ఎత్తారు. దీని ద్వారా 530 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రికి రిజర్వాయర్‌ నీటిమట్టం 60/61 అడుగులు ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరాజు తెలిపారు. మేహాద్రికి ప్రస్తుత ఇన్‌ఫ్లో కూడా దాదాపు 530 క్యూసెక్కులే ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement