
మూగబాలిక తల్లితండ్రులను పరామర్శించిన కేకే రాజు
తాటిచెట్లపాలెం: సీతమ్మధారలో లైంగికదాడిక గురైన మైనర్ మూగ బాలిక కుటుంబ సభ్యులను సోమవారం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కేకే రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరగడం వల్ల నేరాలు, అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. బాధితురాలి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేకే రాజు భరోసా ఇచ్చారు. బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, రవీంద్ర భరత్ పాల్గొన్నారు.