ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్
ఏయూక్యాంపస్ : సూపర్ హీరో తేజ సజ్జా నటించిన విజువల్ వండర్ ‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు.
ఈ సందర్భంగా మేకర్స్ నగరంలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ సెప్టెంబర్ 12 మిరాయ్ థియేటర్లోకి వస్తుంది. ఇది ఒక యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వచ్చి చూడండని కోరాడు. అలాగే మంచు మనోజ్, హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ సినిమా ఆదరించాలని కోరారు.
జీవీఎంసీ అధ్యయన యాత్రకు దూరం
డాబాగార్డెన్స్: ఈ నెల 15 నుంచి 23 వరకు రాజస్థాన్, ఢిల్లీలలో జీవీఎంసీ చేపట్టనున్న అధ్యయన యాత్రలో తాను పాల్గొనడం లేదని జీవీఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి. గంగారావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన నగర మేయర్‌కు లేఖ పంపారు. ఈ తరహా అధ్యయన యాత్రల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని గంగారావు ఆరోపించారు. గతంలో చేసిన అధ్యయన యాత్రల నివేదికలపై ఇప్పటివరకు కౌన్సిల్‌లో చర్చ జరపలేదని, ప్రజలపై పన్నుల భారం పెరుగుతున్న తరుణంలో ఇలాంటి యాత్రలు చేయడం సరికాదని ఆయన అన్నారు.