
పర్యాటకానికి వన్నెతెచ్చేందుకు వియత్నాంతో ఒప్పందం
మహారాణిపేట: పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వియత్నాంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, వియత్నాం టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ చైర్మన్ చౌ ట్రీ యంగ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం బౌద్ధమతానికి సంబంధించిన ప్రాంతాలైన అమరావతిలోని కాలచక్ర, ఉమ్మడి విశాఖలోని బొజ్జన్నకొండ, బావికొండ, తొట్లకొండలను సందర్శించేందుకు వియత్నాం పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకుంటారు. కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారులు జె. మాధవి, జగదీష్, ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.