
రైతులకు అండగా 9న వైఎస్సార్ సీపీ పోరు
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ● ‘అన్నదాత పోరు’పోస్టర్ ఆవిష్కరణ
విశాఖ సిటీ: రైతులకు మేలు చేయని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. యూరియా కొరత, ఇతర రైతాంగ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9న ‘ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరు’ పేరుతో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడడం దారుణమన్నారు. టీడీపీ నేతలు రేషన్ బియ్యం, ఇసుక, మద్యాన్ని వ్యాపారంగా చేసుకున్నారని, యూరియాను కూడా కమీషన్ కోసం రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆర్బీకేల ద్వారా యూరియాను అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్‌వెస్లీ, పేర్ల విజయచంద్ర, ఈర్ల అనూరాధ, పార్టీ నాయకులు జియ్యాని శ్రీధర్, అల్లంపల్లి రాజాబాబు, డాక్టర్ సి.ఎం.ఎ.జహీర్ అహ్మద్, ద్రోణంరాజు శ్రీ వత్సవ్, రామన్న పాత్రు డు, పల్లా చిన్నతల్లి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అబంటి శైలేష్, పి.వి.సురేష్, పేడాడ రమణికుమారి, సనపల రవీంద్ర భరత్, కర్రి రామిరెడ్డి, రాయపురెడ్డి అనీల్‌కుమార్, వడ్డాది దిలీప్‌కుమార్, బోండా ఉమామహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, నీలి రవి, జిల్లా పార్టీ కమిటీ నేతలు మువ్వల సురేష్, ఆల్ఫా కృష్ణ, కార్పొరేటర్లు శశికళ, పద్మారెడ్డి, కో–ఆప్షన్ సభ్యులు ఎం.డి.షరీఫ్, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు బయ్యవరపు రాధ, బెందాళం పద్మావతి, శ్రీదేవి వర్మ, సూర్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.