
‘గ్రీన్ రైల్వే స్టేషన్’గా విశాఖకు ప్లాటినం సర్టిఫికెట
తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలో ఉన్న విశాఖ రైల్వే స్టేషన్ మరో అరుదైన ఘనత సాధించింది. పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు గాను ఈ స్టేషన్‌కు ప్రతిష్టాత్మకమైన గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ (ప్లాటినం) లభించింది. గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఈ సర్టిఫికెట్‌ను విశాఖ రైల్వే స్టేషన్‌కు అందజేయనుంది.విశాఖ రైల్వే స్టేషన్‌లో అమలు చేస్తున్న వివిధ పర్యావరణహిత పద్ధతులను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు. ఇండియన్ రైల్వేస్‌లోని ఎన్విరాన్‌మెంట్ డైరెక్టరేట్, గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సహకారంతో ఈ రేటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ రేటింగ్‌లో భాగంగా ప్యాసింజర్ సౌకర్యాలు, నీటి వినియోగం, శాసీ్త్రయ పారిశుధ్య పద్ధతులు, విద్యుత్ ఆదా, హానికరమైన ఆయిల్స్ వినియోగం తగ్గించడం వంటి అంశాలను తనిఖీ చేసి, అంచనా వేశారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మాట్లాడుతూ ఇది రైల్వే ఉద్యోగులందరి సమష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్విరాన్‌మెంట్ , హౌస్‌కీపింగ్ మేనేజ్‌మెంట్ సిబ్బంది పనితీరు అద్భుతమని అభినందించారు. విశాఖ రైల్వే స్టేషన్ భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.