
‘సౌభాగ్యం’ కిట్లు పంపిణీ
కొమ్మాది: రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (తితిదే)లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ‘సౌభాగ్యం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనానికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కొమ్ములు, కుంకుమ, గాజులు, కంకణాలు అందజేశారు. ముందుగా, సౌభాగ్య కిట్‌లను శ్రీవారి ఆలయం చుట్టూ మంగళవాయిద్యాల నడుమ ప్రదర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటరమణ, హిందూ ధర్మ ప్రచార సిబ్బంది, జిల్లా ధార్మిక ప్రచార కమిటీ సభ్యులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.