
సమ్మోహన భరితం.. సత్యభామ నృత్యోత్సవం
మద్దిలపాలెం: మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 11వ సత్యభామ యువ నృత్యోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజు అంతర్జాతీయ స్థాయి భారతీయ శాసీ్త్రయ నృత్య కళాకారుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ ప్రతిష్టాత్మక నృత్యోత్సవంలో భాగంగా సత్యభామ నేషనల్ అవార్డులు – 2025లను గీతా నారాయణ సుద గాని – కూచిపూడి (ఏపీ), సంజనా పుట్ట – కూచి పూడి (అమెరికా), డా. మనీషా మిట్టల్ – భరతనాట్యం (కర్ణాటక), అపర్ణ శర్మ ఈ.జీ – కేరళ నాటనం (కేరళ), లక్ష్మీశ్రవణ్ – భరతనాట్యం (కర్ణాటక)లకు ప్రదానం చేశారు. వివిధ రాష్రాలకు చెందిన నృత్యోత్సవ డైరెక్టర్లు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ, ఈ ఉత్సవం భారతీయ శాసీ్త్రయ నృత్యాలకు గొప్ప వేదికగా నిలుస్తుందని, కళాకారులకు తమ నృత్యాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం కలుగుతుందని అన్నారు. రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రవిశంకర్ నారాయణ్ సుధాగా ని, రైటర్స్ అకాడమీ అధ్యక్షుడు వి.వి. రమణమూర్తి పాల్గొన్నారు.
జాతీయ నృత్య పోటీలు : నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు, నృత్యోత్సవాల సారఽఽథి బత్తిన విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ తొలిరోజు జరిగిన జాతీయ నృత్య పోటీలలో సుమారు వందకు పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భరతనాట్యం, కథాకళి నృత్య కళాకారిణి పరిమిత ముఖర్జీ, మణిపూరి రాష్ట్రానికి చెందిన సుమనలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. భరతనాట్యం, కూచిపూడి, మణిపూరి, ఒడిస్సీ వంటి భారతీయ శాసీ్త్రయ నృత్యాలతో పాటు జానపద నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.