
రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అల్లిపురం: రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన విజయనగరం జిల్లా మధుపాడ గ్రామం కృష్ణాపురం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద సుమారు రూ.2.64 కోట్ల జీవీఎంసీ నిధులతో నిర్మించిన తారు రోడ్లను మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు జీవీఎంసీ కృషి చేస్తుందని మేయర్ అన్నారు. నగర ప్రజలకు తాటిపూడి రిజర్వాయర్ ద్వారా మంచినీరు సరఫరా అవుతుందన్నారు. అనంతరం తాటిపూడి వాటర్ హెడ్ పైప్‌లైన్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జీవీఎంసీ కార్యనిర్వాహక ఇంజినీరు మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.