
నేడు ‘ఉక్కు’ చర్చలు
ఉక్కునగరం: కేంద్ర కార్మిక శాఖ రీజనల్ లేబర్ కమిషనర్(ఆర్‌ఎల్‌సీ) సోమవారం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు, ఉక్కు యాజమాన్యం, కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 16న జరిగిన చర్చలు విఫలం కావడంతో సమావేశాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుండటంతో ఈ చర్చలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశంలో యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై అంతటా ఆసక్తి నెలకొంది.
గ్రాస్ రూట్స్ ఫుట్‌బాల్ డే విజేత శ్రీకాకుళం
తగరపువలస: మధురవాడలోని శాప్ గ్రౌండ్‌లో ఈ నెల 23న గ్రాస్ రూట్స్ డే సందర్భంగా నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నమెంట్–2025లో శ్రీకాకుళం ఫుట్‌బాల్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. అండర్ బాయ్స్ జట్టు రన్నరప్ సాధించింది. ఉత్తరాంధ్ర జోనల్ అండర్–14 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఆదివారం ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో జూన్ గాలియట్, లోసో సుష్మిత, రాకేష్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ నరసింహారెడ్డి, జిల్లా ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ శరత్, వీడీఎఫ్ కార్యదర్శి అక్కరమాని చినబాబు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎస్‌జీ రామకృష్ణ, స్టార్ ఫెక్స్ సన్నిబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.