
సాయుధ దళాలకు మద్దతుగా నిలుద్దాం
వ్యక్తిగత విభజనలు, ప్రయోజనాలకు అతీతంగా మన సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలి. దేశంలోని పౌరులు, ప్రధానంగా యువత కీలక భూమిక పోషించాల్సిన తరుణమిది. ప్రభుత్వం, పరిపాలన అధికారులు జారీ చేసే అన్ని ఆదేశాలను కచ్చితంగా పాటించాలి. సామాజిక సామరస్యాన్ని, జాతీయ ఐక్యతను దెబ్బతీసే కుట్రను ఓడించడంలో చురుకై న పాత్ర పోషించాలి. ఈ సవాలు సమయంలో మనమందరం దేశ భద్రత, సమగ్రత, గౌరవానికి మద్దతుగా ఐక్యంగా నిలబడదాం.
– డాక్టర్ ఎన్.ఎం.యుగంధర్,
అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్, ఆంధ్ర యూనివర్సిటీ