
నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఎంవీపీకాలనీ: పీఎం అజాయ్ పథకంలో భాగంగా ఎస్సీ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) సంయుక్తంగా ఈ శిక్షణ అందిస్తున్నాయి. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ పీడీ సత్యపద్మ, ఎన్‌ఏసీ డైరెక్టర్ రవికుమార్ మంగళవారం ఈ శిక్షణ కార్యాచరణపై కసరత్తు చేశారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు గల ఎస్సీ యువత ఈ ఉచిత నైపుణ్య శిక్షణకు అర్హులని పీడీ సత్యపద్మ తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులైన వారు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పెదగంట్యాడలోని నాక్ శిక్షణా కేంద్రంలో ఈ శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు 79810 22453, 90632 69849 నంబర్లను సంప్రదించాలన్నారు.