కేకే లైన్‌లో రైళ్ల గమ్యం కుదింపు | - | Sakshi
Sakshi News home page

కేకే లైన్‌లో రైళ్ల గమ్యం కుదింపు

May 7 2025 1:18 AM | Updated on May 7 2025 1:18 AM

కేకే లైన్‌లో రైళ్ల గమ్యం కుదింపు

కేకే లైన్‌లో రైళ్ల గమ్యం కుదింపు

తాటిచెట్లపాలెం: ఆధునికీకరణ పనుల నిమిత్తం కేకే లైన్‌లో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సందీప్‌ తెలిపారు. ● ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నం–కిరండూల్‌(58501) పా సింజర్‌ దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ● ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కిరండూల్‌–విశాఖపట్నం(58502) పాసింజర్‌ దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ● ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నం–కిరండూల్‌(18515) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ● ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ బయల్దేరే కిరండూల్‌–విశాఖపట్నం(18516) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ దంతేవాడ నుంచి బయల్దేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement