రూ.40 కోట్ల | - | Sakshi
Sakshi News home page

రూ.40 కోట్ల

Mar 21 2025 1:05 AM | Updated on Mar 21 2025 1:01 AM

సర్కారు భూమికి రెక్కలు
కొమ్మాదిలో సుమారు 3.9 ఎకరాలు కబ్జా చేసేస్తున్న తెలుగు తమ్ముళ్లు
● నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించిన హైకోర్టు ● అయినా డీ పట్టా భూముల్లో దర్జాగా ఆక్రమణలు ● సహకరిస్తున్న భీమిలి రెవెన్యూ అధికారులు ● ఉన్నతాధికారులకు మాత్రం నిర్మాణాలు ఆపేశామంటూ నివేదికలు

అక్రమార్కులకు

రెవెన్యూ అధికారి అభయం!

ఆర్‌డీవో, తహసీల్దార్‌ ఆదేశించినా.. స్థానిక రెవెన్యూ అధికారి మాత్రం భూ కబ్జాదారులకు అభయహస్తమిచ్చేశారు. ‘మీ నిర్మాణాల పని మీరు కానివ్వండి.. ఎవరు ఆపుతారో నేనూ చూస్తానన్నట్లు’గా అండగా నిలబడ్డారు. తహసీల్దార్‌, ఆర్‌డీవో, జేసీ ఎవరు వచ్చినా.. నేను చూసుకుంటానంటూ.. అందరూ నా మాటే వింటారని సదరు రెవెన్యూ అధికారి చెబుతుండటం గమనార్హం. దీంతో కోళ్ల ఫారం నిర్మాణాలు చకచకా సాగిపోతున్నాయి. ఉన్నతాఽధికారులు సర్వే నం.157/1 భూమి పరిస్థితి ఏంటని అడిగితే మాత్రం.. ప్రభుత్వ ఆధీనంలో ఉంది.. ఎలాంటి నిర్మాణాల జరగడం లేదని తప్పుడు నివేదికలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్రమణలు చేపడుతున్న కబ్జాదారుల నుంచి రూ.లక్షలు దండుకొని రెవెన్యూ సిబ్బంది పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల ఇళ్లు, చిన్న చిన్న దుకాణాలపై ప్రతాపం చూపిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం.. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే మాత్రం.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, విశాఖపట్నం : విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలోని వెంకట్‌నగర్‌ సమీపంలో కొమ్మాది సర్వే నం.157/1లో 3.93 ఎకరాల డి–ఫారం పట్టా భూమి అక్రమార్కుల చేతుల్లో చిక్కుకుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం పైడితల్లి అనే వ్యక్తి ఈ భూమి సాగుచేసుకునేవారు. అప్పట్లో ఆయనకు డీ–పట్టా ఇచ్చారు. సదరు పైడితల్లి తర్వాత ఈ భూమిని వదిలేశారు. అప్పటి నుంచి ఇది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లోనే ఉంది. గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ ప్రభుత్వ ఇళ్లు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. ఈ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి టీడీపీ నేతల కన్ను ఈ భూమిపై పడింది. గంటాకు సన్నిహితులం, 6వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడి అనుచరులమంటూ కొందరు ఈ భూమిని ఆక్రమించేందుకు పన్నాగం పన్నారు. గతంలో పైడితల్లికి ఇచ్చిన పట్టా మాదిరిగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో అధికారులు ఈ భూమిని కాపాడారు. దీంతో సదరు భూ కబ్జాదారులు కొందరు రెవెన్యూ అధికారుల సూచనలతో కోర్టుకు వెళ్లారు. అయితే.. ఇది పక్కాగా ప్రభుత్వ భూమిగా రికార్డులు స్పష్టం చేస్తుండటంతో కోర్టు స్టేటస్‌కో ఇచ్చింది.

ప్రభుత్వం మారిన వెంటనే..

ప్రస్తుతం ఈ స్థల వివాదం న్యాయస్థానంలో ఉంది. యథాతఽఽథ స్థితిగా భూమిని ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. అయినా.. ఓ రెవెన్యూ అధికారి అండతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. చుట్టూ ఫెన్సింగ్‌ మాదిరిగా వేసేసి.. భూమిని చదును చేసేశారు. కోళ్లఫారం ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలు కూడా చకచకా సాగిపోతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ సిబ్బంది ఆ నిర్మాణాలను అడ్డుకున్నారు. తగిన ధ్రువపత్రాలతో తహసీల్దార్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని నోటీసులు జారీ చేశారు. అయినా ఆగకుండా నిర్మాణాలు చేస్తుండటంతో ఆర్డీవోకి ఫిర్యాదు వెళ్లింది. ఇటీవలే ఆర్డీవో సంగీత్‌ మాథుర్‌ స్థలాన్ని పరిశీలించి వెంటనే నిర్మాణాలు ఆపించేసి మొత్తం తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వెంటనే నిర్మాణాలు ఆపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement