
పోలీస్ శాఖలో బదిలీలు
విశాఖ సిటీ: విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్‌ఐల నుంచి కానిస్టేబుళ్ల వరకు 34 మందికి స్థానచలనాలు కలిగాయి. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ లాండ్ ఆర్డర్ ఏఎస్‌ఐగా ఉన్న పి.నరసింగరావును త్రీటౌన్‌కు, మల్కాపురం క్రైమ్ ఏఎస్‌ఐ జియా రుక్సానాను మహారాణిపేట లా అండ్ ఆర్డర్‌కు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కె.సుబేదాబేగంను కంచరపాలెం లా అండ్ ఆర్డర్‌కు బదిలీ చేశారు. వీరితో పాటు 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 11 మంది కానిస్టేబుళ్లకు బదిలీ అయ్యాయి.