శిక్షణకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

శిక్షణకు వేళాయె

Jun 20 2024 1:44 AM | Updated on Jun 20 2024 1:44 AM

శిక్ష

శిక్షణకు వేళాయె

● భావి ఉపాధ్యాయులకు బంగారు భవిష్యత్‌ ● నేటి నుంచి డీఎడ్‌ తరగతులు ● భీమునిపట్నంలో ప్రభుత్వ డైట్‌ కాలేజీ ● ఈ ఏడాది మొదటి ఫేజ్‌లో 47 మందికి అడ్మిషన్లు

విశాఖ విద్య: డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ) కోర్సు ప్రవేశాలు పొందిన విద్యార్థులకు గురువారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 2024–25 విద్యా వార్షిక క్యాలెండర్‌కు అనుగుణంగా పాఠ్యాంశాల బోధనపై విద్యాశాఖాధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. భావి ఉపాధ్యాయులుగా మారే క్రమంలో శిక్షణ కోసమని వస్తున్న విద్యార్థులకు తొలి రోజు స్వాగత వేడుక, పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించేలా డైట్‌ కాలేజీలో తగిన ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయ విద్య తీరుతెన్నులపై మూడు రోజులపాటు, డైట్‌ కాలేజీ సీనియర్‌ అధ్యాపకులతో సూచనలు, సలహాలు ఇచ్చేలా షెడ్యూల్‌ సిద్ధం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమునిపట్నంలో మాత్రమే ఉపాధ్యాయ(డీఎల్‌ఈడీ) శిక్షణ కాలేజీ అందుబాటులో ఉంది. అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్విహిహస్తుండటంతో దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల నుంచి విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

డీఎడ్‌ శిక్షణతో జాబ్‌ గ్యారెంటీ

రెండేళ్ల కాలవ్యవధితో కూడిన డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో త్వరితగతిన ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. ఫ్రీ ప్రైమరీ, పాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు డీఎడ్‌ కోర్సు చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటంతో వీటికి మంచి డిమాండ్‌ ఉంది. భీమునిపట్నం ప్రభుత్వ డైట్‌ కాలేజీలో నిష్ణాతులైన సీనియర్‌ అధ్యాపకులు పనిచేస్తుండటంతో విద్యార్థులకు నైపుణ్యతతో కూడిన శిక్షణ అందుతోంది. జాబ్‌ గ్యారెంటీ కోర్సు కావటంతో శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఏకై క కళాశాల

ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి భీమునిపట్నంలో డైట్‌ కాలేజీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వంద సీట్లు అందుబాటులో ఉండగా, 2024–25 విద్యా సంవత్సరానికి మొదటి ఫేజ్‌లో 47 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. రెండో విడత కౌన్సెలింగ్‌పై అధికారులు దృష్టి సారించారు.

విద్యార్థుల అభ్యున్నతికి కృషి

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఎల్‌ఈడీ కోర్సు మొదటి సంవత్సరం తరగతులు గురువారం నుంచి ప్రారంభిస్తున్నాం. తొలి మూడు రోజులు కోర్సుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నాం. నైపుణ్యతతో కూడిన శిక్షణ అందించి, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తాం.

–ఎం.జ్యోతికుమారి, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డైట్‌ కాలేజీ, భీమునిపట్నం

శిక్షణకు వేళాయె 1
1/1

శిక్షణకు వేళాయె

Advertisement
 
Advertisement
Advertisement