
డాక్టర్ ఖాదర్ వలీని సత్కరిస్తున్న ప్రముఖులు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): సహజ సిద్ధంగా పండే చిరు ధాన్యాలు సంపూర్ణ ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలీ అన్నారు. అదే సమయంలో రసాయనాలు మిళితమైన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే కంపెనీల మోసాలను అరికట్టాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ఖాదర్‌వలీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిమి సంహారక మందుల వినియోగంతో జీవవైవిధ్యానికి ముప్పు తీసుకువస్తున్నారన్నారు. పింక్ రివల్యూషన్ పేరుతో పెద్ద ఎత్తున జంతువులను పెంచి మాంసం రెడీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి కృత్రిమ ఆహార పదార్థాలు జీవన వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరించారు. మానవ జాతికి అదృష్టం కొబ్బరి పాలు అని, ఇవి తల్లిపాలతో సమానమన్నారు. చిరుధ్యానాలు సాగుకు ఎలాంటి రసాయనిక మందులు అవసరం లేదన్నారు. దీంతో జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చునని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ డాక్టర్ ఖాదర్ వలీ చిరుధ్యానాల ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పి గొప్ప కీర్తిని పొందారని కొనియాడారు. ఈ ఏడాదిని ప్రపంచ చిరుధ్యానాల ఏడాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కళాభారతి ట్రస్ట్ అధ్యక్షుడు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, విజయనిర్మాణ్ అధినేత విజయకుమార్, గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం నేతలు జగలంకుమారస్వామి, ఎం.యుగంధర్‌రెడ్డి, శ్రీదేవి, గ్రీన్ క్‌లైమెట్ అసోసియేషన్ ప్రతినిధి జనపరెడ్డి రత్నం పాల్గొన్నారు.
సీజ్ చేసిన వాహనాల వేలం నేడు
ఆహార పదార్థాలతో కంపెనీలు చేసే మోసాలు అరికట్టాలి
సన్మాన సభలో పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలీ