352 కిలోల కుళ్లిన చికెన్‌ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

352 కిలోల కుళ్లిన చికెన్‌ స్వాధీనం

Mar 28 2026 10:33 AM | Updated on Mar 28 2026 10:33 AM

పరిశుభ్రమైన కేంద్రాల నుంచే..

సనత్‌నగర్‌: కుళ్లిన చికెన్‌ సరఫరా చేస్తున్న వ్యక్తిని నగర కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం (హెచ్‌–ఫాస్ట్‌) అరెస్టు చేసింది. అతని నుంచి 352 కిలోల మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను నగర కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్‌–ఫాస్ట్‌ బృందం వెటర్నరీ ఆఫీసర్‌ డాక్టర్‌ నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్‌నగర్‌, జింకలవాడ వద్ద ఉన్న ‘మెసర్స్‌ ఎస్‌పీఆర్‌ చికెన్‌’ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన సూరజ్‌పాల్‌.. కుళ్లిన చికెన్‌ను స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు నిర్థారణ అయ్యింది. చికెన్‌ నిల్వ ఉంచిన ప్రాంగణం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. సదరు సంస్థకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ గడువు ముగిసినట్లు గుర్తించారు. నిల్వ చేసిన మాంసం వినియోగానికి ఏమాత్రం యోగ్యమైనది కాదని నిర్థారించారు. హెచ్‌–ఫాస్ట్‌ బృందం స్వాధీనం చేసుకున్న 352 కిలోల గడ్డకట్టిన కుళ్లిన చికెన్‌న్‌తోపాటు నిందితుడిని సనత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. హెచ్‌–ఫాస్ట్‌ ఇన్‌స్పెక్టర్‌, సిబ్బంది, సనత్‌నగర్‌ పోలీసులు పాల్గొన్నారు.

హోటళ్లకు సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

ఆహార పదార్ధాలను కేవలం ఆధీకృత, పరిశుభ్రమైన కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని నగర కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ తెలిపారు. సరైన గుర్తింపు లేని విక్రేతల వద్ద ఆహారాన్ని తీసుకోవద్దన్నారు. ఎక్కడైనా అపరిశుభ్రమైన, అనుమానాస్పద ఆహార తయారీ పద్ధతులు కనిపిస్తే వెంటనే అధికారుకు సమాచారం అందించాలన్నారు.

– వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement