ఇష్టారాజ్యంగా కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా కేటాయింపు

Mar 28 2026 10:38 AM | Updated on Mar 28 2026 10:38 AM

వికారాబాద్‌: కర్షకుల కోసం ఏర్పాటైన రైతు సహకార సంఘాలు వారి సేవలకు దూరమవుతున్నాయి. జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) అధికారులు, అందులో విధులు నిర్వహించే ఉద్యోగులు లోపాయికారి దందాకు తెరతీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రైతులకు అండగా ఉండే ఈ సొసైటీలు మెల్లగా వారి సేవలకు స్వస్తి పలుకుతున్నాయి. జిల్లాలో డీసీఎంఎస్‌ల పరిస్థితి దారుణంగా తయారైంది. వీరి వ్యవహార శైలిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటికి జిల్లాలో పెద్దఎత్తున ఆస్తులు ఉండగా వాటి లీజు కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులతో అధికారులు, ఉద్యోగులు కుమ్మకై ్క తక్కువ రేట్లకు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో వందకు పైగా దుకాణాలు(సెటర్లు), పదికిపైగా గోదా ము లు, రైస్‌ మిల్లులు, ఇతర భవనాలు ఉన్నా యి. వీటిలో ఎక్కువ శాతం లీజుకు ఇచ్చా రు. వాటిని మార్కెట్‌ విలువ కంటే తక్కువ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాక కూడా వారే చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. బినామీలకు రుణాలిప్పించి వారిని మెండిబకాయిల జాబితాలో చేరుస్తారు. అనంతరం సెటిల్‌మెంట్‌ పేరిట (రైటాప్‌) మాఫీ చేయించి లబ్ధి పొందుతారు. ఆ తర్వాత వారికే మళ్లీ రుణాలు వచ్చేలా సహకరిస్తూ పాలకవర్గాలు, అధికారులు వాటాలు పొందుతారనే విమర్శల ఉన్నాయి.

తాండూరు కందితో లాభాలు

గతంలో ప్రతి మండల కేంద్రంలో డీసీఎమ్మెస్‌ల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించేవారు. ఇవి ప్రభుత్వరంగ సంస్థలు కావటంతో నిర్దేశిత ధరలకే అందేవి. మెల్లమెల్లగా ఈ దుకాణాలను బంద్‌ చేసి నియోజకవర్గ కేంద్రాల్లోనే విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా జిల్లా కేంద్రంలోనూ రైతు సేవలకు డీసీఎంఎస్‌ స్వస్తి పలకటం కర్షకులకు శాపంగా మారింది. దీంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల దగ్గరేఅధిక ధరలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నదాతలకు మేలు చేకూర్చే సేవలకు స్వస్తి పలికిన వారు, తమకు లాభాలు వచ్చే పనులు మాత్రం చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన కందులను పప్పుగా మార్చి తాండూరు కంది పప్పు పేరుతో విక్రయిస్తూ సంస్థ లాభాలు పొందుతోంది. అయితే తాండూరు కందిపప్పు పరిగి, వికారాబాద్‌లో విక్రయిస్తుండగా తాండూరులో విక్రయించటంలేదు. డీసీఎంఎస్‌లో పని చేసే ఉద్యోగులకు పని లేకుండా పోయింది. దీంతో వారు తమ సొంత పనులు చక్కబెడుతున్నారు.

డీసీఎంఎస్‌కు సంబంధించి వికారాబాద్‌లో 39 దుకాణాలు, రెండు గోదామున్నాయి. తాండూరులో మూడు గోదాములు, 40 దుకాణాలు, ఒక స్కూల్‌ బిల్డింగ్‌, ఒక రైస్‌మిల్‌, ఒక దాల్‌మిల్‌ ఉన్నాయి. పరిగిలో 25 దుకాణాలు, ఐదు గోదాములు, ఒక రైస్‌ మిల్‌ ఉంది. గతంలో తమ దుకాణాలు, గోదాముల్లో వారే ఎరువులు, విత్తనాలు అమ్మడం, రైస్‌ మిల్లులు నిర్వహించటం చేసేవారు. ప్రస్తుతం రైతు సేవలు మానేసి దుకాణాలు, గోదాములు, రైస్‌ మిల్లులు అన్ని లీజ్‌కు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. అయితే దుకాణాల కేటాయింపులో లోపాయికారిగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి ఈ మూడు చోట్ల మెయిన్‌ రోడ్లలోనే దుకాణా సముదాయాలున్నాయి. ఇక్కడ ఒక్క దుకాణం రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు అద్దె ఇస్తారు. డీసీఎమ్మెస్‌ అధికారులు మాత్రం తక్కువ ధరలకే దుకాణాలు కట్టబెడుతూ సంస్థకు నష్టం చేస్తున్నారు. ఒక్కో దుకాణం ఓ చోట రూ.4,720, మరో చోట రూ.5,450, ఇంకో చోట రూ.6,680, రూ.9,500 ఇలా అద్దె వసూలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement